సింగరేణి(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జీఎం పర్సనల్(ఐఆర్‌పీఎం) కవితానాయుడు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా విజేతలకు ఈనెల 8న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు పి.కిరణ్మయి, బి.సుమలత, డి.శారద, కె.రమ, ఎ.విజయకుమారి, జీ.బీ.అరుణకుమారి, కె.శైలజ, ఎన్.గౌతమి, బి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment