డయాగ్నస్టిక్ ఫీజులు 20 శాతం తగ్గించాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే ఫీజులను 20 శాతం మేర తగ్గించాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ నిర్వాహకులకు సూచించారు. ఆయా కేంద్రాల వారితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఫీజుల్లో 20 శాతం మేర తగ్గిస్తూ ఆమోదించామని పేర్కొన్నారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు సీహెచ్ కృష్ణప్రసాద్, సెక్రటరీ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్, ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి, డాక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment