20 కేజీల గంజాయి పట్టివేత
భద్రాచలంఅర్బన్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు 20 కేజీల గంజాయి తరలిస్తూ.. పట్టణంలోని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద టౌన్ పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వ్యక్తులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట పట్టణానికి చెందిన వారిగా తేలిందని, గంజాయిని మల్కన్‌గిరిలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తూ పట్టుబడ్డారని, గంజాయి విలువ రూ.10.30 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
గంజాయి పట్టివేత
చండ్రుగొండ: ఓ వ్యక్తి గంజాయిని అక్రమంగా తరలిస్తూ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో మంగళవారం పట్టుబడ్డాడు. ఎస్‌ఐ శివరామకృష్ట కథనం ప్రకారం.. క్లూస్ టీంతో కలిసి పోలీసుటు వాహనాల తనిఖీ చేపట్టగా చండ్రుగొండకు చెందిన డి.వెంకటేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా ఆపారు. తనిఖీ చేయగా 500 గ్రాముల గంజాయి లభించడంతో గంజాయితోపాటు బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment