వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించండి
చండ్రుగొండ : వసతిగృహాల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అధికారులకు సూచించారు. స్థానిక కస్తూర్బా విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలుర వసతిగృహాలను మంగళవారం ఆమె సందర్శించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుంటే సహించేది లేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేవని బాలికలు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిరంజన్‌రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లు గౌరవంగా జీవించాలి
కొత్తగూడెంటౌన్: ట్రాన్స్‌జెండర్లు గౌరవప్రదంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి అన్నారు. మంగళవారం కొత్తగూడెం హనుమాన్‌బస్తీలో వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వివిధ పరిస్థితుల కారణంగా ట్రాన్స్‌జెండర్లుగా, సెక్స్ వర్కర్లుగా మారిన వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతీ నెల బియ్యం పంపిణీ చేసేలా చూడాలని సెక్యూర్ ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్‌ను అదేశించారు.
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి భానుమతి
Comments
Please login to add a commentAdd a comment