పాల్వంచరూరల్: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతసూరారం గ్రామానికి చెందిన భూక్యా అశోక్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, గత నెలలో ఇంటి గోడదూకి వచ్చాడని భూక్యా అరుణ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
లారీడ్రైవర్‌పై..
మండలంలోని పెద్దమ్మగుడి వద్ద బీసీయం జాతీయ రహదారిపై పాల్వంచవైపు వస్తున్న కారును ఈ నెల 2వ తేదీన వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. కారు వెనుక భాగం దెబ్బతిన్నదని కారుడ్రైవర్ హన్మంతరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లారీడ్రైవర్ గుగులోత్ రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment