చెక్కు బౌన్స్ కేసు కొట్టివేత
భద్రాచలంఅర్బన్: సారపాకకు చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు వరంగల్‌కు చెందిన కొత్త ఇందిర రూ.20 లక్షలు ఇవ్వాలని 2017లో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి.శివనాయక్ మంగళవారం కేసును కొట్టి వేశారు. కొత్త ఇందిర తరఫున ముత్యాల కిశోర్, దాసరి కవిత వాధించారు.
కేసు నమోదు
పాల్వంచ: చిట్టి డబ్బులు ఇవ్వలేదని దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన చింతలచెర్వు కోటేశ్వరరావు భార్య వాణి పండ్ల వ్యాపారం చేస్తోంది. వాసాల గోవర్ధని వద్ద వారం వారం చిట్టీ డబ్బులు కడుతోంది. ఇటీవల డబ్బులు కట్టక పోవడంతో గోవర్ధని, వాసాల శ్రీనివాస్, సరిత కలిసి వాణి ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగడంతో దాడికి పాల్పడ్డారు. వాణి ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్‌ఐ రాఘవయ్య ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లో నివాసం ఉండే కొణిజర్ల సత్యనారాయణమూర్తికి చెందిన ఇంట్లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న సామగ్రి, పొలం ధ్రువపత్రాలు, బంగారం, నగదు, స్టడీ సర్టిఫికెట్లతో పాటు ఇతర పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షల ఆస్టినష్టం జరిగినట్లు ఇంటి యజమాని సత్యనారాయణ తెలిపారు.
భార్యపై భర్త కత్తితో దాడి
పాల్వంచ: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయమైంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బొల్లేరుగూడెం ఏరియా వర్తక సంఘం భవన్ దగ్గర రేగా రవీందర్, లక్ష్మీ ఏడాదిగా నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మద్యం తాగేందుకు రవీందర్ లక్ష్మిని అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మరోమారు గొడవ జరగగా.. రవీందర్ లక్ష్మిని కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కాగా రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు.
చెక్కు బౌన్స్ కేసు కొట్టివేత
Comments
Please login to add a commentAdd a comment