బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దు..
ఇల్లెందు: 130 ఏళ్ల కిందట ఇల్లెందులో బొగ్గు పుట్టిందని, అలాంటి బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దని ఎమ్మెల్యే కోరం కనకయ్య సింగరేణి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరుతో జేకే–5 ఓసీ మూతపడే ప్రమాదం ఉందని, నూతన పూసపల్లి ఓసీ అనుమతులు జాప్యం అవుతున్నాయని, కార్మికులు, ఉద్యోగుల బదిలీలు తప్పవని ఆందోళన చెందుతున్న తరుణంలో జేకేఓసీని సింగరేణి అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. అక్కడి బొగ్గు నిల్వలు పరిశీలించారు. ఓసీలో ఉన్న ఓవర్‌మెన్స్, సర్వే అధికారులతో మైన్ పరిస్థితితులను అడిగి తెలుసుకున్నారు. పూసపల్లి ఓసీ అనుమతులు వచ్చే వరకు ఇక్కడి అధికారులు, కార్మికులను బదిలీ చేయకుండా ఓసీని కొనసాగించాలని జీఎం కృష్ణయ్యను కోరారు. జీఎం కృష్ణయ్య మాట్లాడుతూ.. పూసపల్లి ఓసీ ఈఎస్‌సీ సమావేశం ఈ నెల 18న ఉందని, తుది అనుమతులు లభించినా ఏప్రిల్, మే నెలలో ఓసీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఐఎన్‌టీయూసీ నేతలు జనక్‌ప్రసాద్ గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు మోహన్‌రావు, కృష్ణమోహన్, పూర్ణచందర్, గోచికొండ సత్యనారాయణ, మహబూబ్, బండారి నాగేశ్వరరావు, పడిదల నవీన్, బొల్లెద్దుల ప్రభాకర్, కుడితి శ్రీనివాస్, బాబూరావు, కాంగ్రెస్ పట్టణ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, దొడ్డా డానియేల్, సుదర్శన్ కోరీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment