నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
కృషి, పట్టుదల ఉంటే విజయం సాధ్యం
నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి
పాల్వంచరూరల్ : కృషి, పట్టుదల, అంకుఠిత దీక్ష ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని వరంగల్ నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ అకాడమీ సైన్సెస్, జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయిన మాట్లాడారు. కొందరు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినా ఉన్నతంగా నిలుస్తారని, వారిలో ఉంటే పట్టుదలే దానికి కారణమని అన్నారు. ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలతో జీవిస్తున్నారని, అలాంటి వారికి విద్యార్థులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, లెక్చరర్ రాజ్యలక్ష్మి, కేజీబీవీ వైస్ ప్రిన్సిపాల్ జె.మాధవి, విజయప్రసాద్, అరుణకుమారి, డి.రమేష్, కొండల్‌రావు, స్వరూపారాణి, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment