
సింగరేణిలో ముగిసిన పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీ పోస్టులకు ఇంటర్నల్ అభ్యర్థులతో నిర్వహించిన మూడు రకాల పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జూనియర్ మైనింగ్ ఆఫీసర్ (ఈ గ్రేడ్–1) 87 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేసుకోగా 17 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇక జూనియర్ ఆఫీసర్ (ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్) నాలుగు పోస్టులకు ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఐదుగురు, జూనియర్ సర్వే ఆఫీసర్ 64 పోస్టులకు 71 మంది దరఖాస్తు చేసుకుని 67 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం మూడు విభాగాల్లో 155 ఖాళీలకు 98 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులోనూ 89 మంది మాత్రమే పరీక్ష రాశారని సింగరేణి యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించగా రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం నికోలస్ పర్యవేక్షించారు. పరీక్ష ఫలితాలను ఆదివారం రాత్రికే సింగరేణి వెబ్‌సైట్‌తో పాటు, సింగరేణి ప్రధాన కార్యాలయంలోని నోటీస్ బోర్డ్‌లో ప్రదర్శించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment