రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
● పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు ● కొత్తగూడెం కోర్టులో వెయిటింగ్ హాల్ ప్రారంభం
భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్/కొత్తగూడెంటౌన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈఓ రమాదేవి స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఆంజనేయస్వామి, లక్ష్మీతయారమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం జస్టిస్ నందా భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి రాముల వారి ప్రతిమ అందజేశారు. అనంతరం జస్టిస్ నందా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈఓ రజనీకుమారి జడ్జికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.
కొత్తగూడెం కోర్టులో..
కొత్తగూడెం కోర్టులో నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను న్యాయమూర్తి సూరేపల్లి నందా ఆదివారం ప్రారంభించారు. ఆమెకు జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ.. న్యాయ సేవలను అందుబాటులోకి తేవడంలో, లీగల్ ఆవేర్‌నేస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, మణుగూరు, దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జీలు కె. సూరిరెడ్డి, బి.భవానీ, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం, లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment