పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపరం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.. పసుపు, కుంకుమ, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.
నేడు హుండీ లెక్కింపు..
పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment