
డీసీసీబీ మాజీ చైర్మన్‌కు తప్పిన ప్రమాదం
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు ప్రమాదం తప్పింది. ఖమ్మం నుండి సత్తుపల్లికి ఆయన కారులో వెళ్తుండగా వీ.వీ.పాలెం వద్ద ఖమ్మం– వైరా ప్రధాన రోడ్డులో గేదె అడ్డుగా వచ్చింది. ఆ గేదెను తప్పించే క్రమాన దాన్ని ఢీకొట్టడంతో నాగభూషణం, కారులో ఉన్న మాజీ రెవెన్యూ ఉద్యోగి లింగయ్యకు స్పల్పగాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం ఽముందు భాగం ధ్వంసం కాగా, గేదె మృతి చెందింది. ఈమేరకు నాగభూషణంను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పరామర్శించగా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రమాదంపై ఫోన్‌లో ఆరా తీశారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
కామేపల్లి: అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సాయికుమార్ తెలిపి న వివరాలు... మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి శనివారం రాత్రి లారీలో బియ్యాన్ని లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్నాడనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈమేరకు 250క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, వాహనంతో సహా సివిల్ సప్లయీ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

డీసీసీబీ మాజీ చైర్మన్‌కు తప్పిన ప్రమాదం