
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పాల్వంచ: ప్రస్తుత వేసవిలో కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కేటీపీఎస్ 5,6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. 81వ జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కేటీపీఎస్ 5,6 దశల ఫైర్, సేఫ్టీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మాగారంలో సిబ్బంది రక్షణ పరికరాలు ధరించాలన్నారు. ఎస్‌ఈలు జీవి.ధర్మారావు, టి.సత్యనారాయణ, ఎస్.సునీల్, ఇతర అధికారులు సతీష్, చంద్రశేఖర్, డి.కిరణ్, భాగం రాంప్రసాద్, వై.శ్రీనివాస్, సమ్మయ్య, నాగయ్య, శేషసాయి, మహేశ్వరరావు, నాగరాజు, రజిత, సిబ్బంది పాల్గొన్నారు.