
సీఎం వచ్చిన రోజే పెళ్లి చేసుకుంటా !
● ఓ కాంగ్రెస్ కార్యకర్త స్పష్టీకరణ ● రేవంత్‌రెడ్డిని రప్పించాలంటూ వైరా ఎమ్మెల్యేకు వినతి
కారేపల్లి: ‘సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తా’ అంటూ కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటున్నాడు. మేకలతండాకు చెందిన భూక్యా గణేష్‌కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్‌కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్‌రెడ్డి అన్నా చాలా ఇష్టం. దీంతో రేవంత్‌రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. ఆయనకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కై ండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్‌కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా.. అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

సీఎం వచ్చిన రోజే పెళ్లి చేసుకుంటా !