
రన్ రాజా.. రన్ !
ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్
● రూ.6.65కోట్ల నిధులతో పనులు ప్రారంభం ● మూడు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ
ఖమ్మం స్పోర్ట్స్: వేలాది మంది క్రీడాకారులకు ఓనమాలు నేర్పడమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. రూ.6.65 కోట్ల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యయి. మట్టి ట్రాక్‌లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు
ఖమ్మంలో అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తుండగా.. స్టేడియంలో ఇన్నాళుల సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడలేదు. జిల్లా క్రీడాశాఖ అధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్‌లు చొరవ చూపినా ఫలితం కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ మంజూరు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకా క ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ భావించినా నిధుల లేమి వేధించింది. ఇంతలోనే ట్రాక్ ప్రతిపాదిత స్థలాన్ని క్రికెట్ శిక్షణకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలా రకరకాల అడ్డంగకులతో ట్రాక్ నిర్మాణం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
పట్టుబట్టడంతో...
గత రెండేళ్లుగా జిల్లా క్రీడల శాఖ, అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచ్‌లు సింథటిక్ ట్రాక్ కోసం పట్టుపట్టా యి. స్టేడియంలో మట్టిట్రాక్‌పై శిక్షణ పొందిన అబ్దుల్ నజీబ్‌ఖరేషి, పవన్‌కుమార్, సుధాకర్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మరి కొందరు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇక్కడ అకాడమీకి తోడు అనుభవం కలిగిన కోచ్ ఉన్నందున సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందుతుందనే భావనతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ట్రాక్ ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మున్సి పల్ శాఖ అధికారులతో చర్చించి నిధులు కేటాయింపునకు సూచనలు ఇచ్చారు. ఈమేరకు ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ ట్రాక్‌ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకరావాలనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రన్ రాజా.. రన్ !

రన్ రాజా.. రన్ !