
రజతోత్సవాలకు తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
మణుగూరు రూరల్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. తొలుత పట్టణంలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గులాబీ జెండాను పార్టీ జిల్లా ఽఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎగురవేశారు. అనంతరం కార్లను, ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మార్గమధ్యలో మాజీ ఎమ్మెల్యే, నాయకులు నృత్యాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మండల వ్యాప్తంగా వాడవాడనా పార్టీ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేసి సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, నాగెల్లి వెంకటేశ్వర్లు, నూకారపు రమేష్, ఎడ్ల శ్రీనివాస్, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, ఎడవల్లి వెంకటయ్య, ముత్యంబాబు పాల్గొన్నారు.