
●ఎండ, అల్ట్రా వైలెట్ కిరణాలతో చెడు ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 41–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతకు తోడు అల్ట్రా వైలెట్ కిరణాలు, వడగాలులు శరీరంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. వివిధ వృత్తులు చేసేవారు, రైతులు, వ్యవసాయ కూలీలు తీసుకోవాల్సి న జాగ్రత్తలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రవి కుమార్ వివరించారు.
●వీలైనంత వరకు వ్యవసాయ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకోవాలి. తప్పనిసరై మధ్యాహ్నం చేయాల్సి వస్తే తలపై ఎండ పడకుండా టోపీ, గొడుగు ధరించాలి. నీరు చెమట రూపంలో బయటకు వెళ్లనున్నందున నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి. రైతులు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లినప్పుడు నీడ పట్టున చెట్ల కింద సేద తీరేలా చూడాలి.

●ఎండ, అల్ట్రా వైలెట్ కిరణాలతో చెడు ప్రభావం