
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.67 లక్షల కొత్త కంపెనీలు ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘2021–22లో ఏర్పాటైన కంపెనీలు 2020–21తో పోలిస్తే 8 శాతం అధికం. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద 2018–19లో 1.24 లక్షల కొత్త కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి.
2019–20లో 1.11 లక్షల కంపెనీలు, 2020–21లో 1.55 లక్షల కంపెనీలు చొప్పున నమోదయ్యాయి’’అని కార్పొరేట్ శాఖ వెల్లడించింది. వ్యాపార సేవల్లో 44,168 కంపెనీలు, తయారీలో 34,640 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు కావడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 31,107 కంపెనీలు నమోదయ్యాయి.
చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!