పెళ్లిరోజు గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య | 1 million USD lottery ticket won by indian women at Dubai Duty Free Millennium Millionaire series | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజు గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య

Published Tue, May 21 2024 3:21 PM | Last Updated on Tue, May 21 2024 6:46 PM

1 million USD lottery ticket won by indian women at Dubai Duty Free Millennium Millionaire series

పెళ్లిరోజున భర్త ఇచ్చిన డబ్బుతో భార్య ఏకంగా రూ.8.2 కోట్లు సంపాదించిన ఆసక్తికర సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళ తన భర్త హర్నెక్‌ సింగ్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త పాయల్‌కు బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు.

ఆ డబ్బుతో పాయల్‌ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్‌ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్‌) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్‌ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2 కోట్లు)ను గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..‘నేను ఈ సిరీస్‌లో విజేతగా మారడానికి నా భర్త ఇచ్చిన డబ్బే కారణం. ఏప్రిల్ 20న మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు 1,000 ధిరమ్‌లు గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో డీడీఎఫ్‌ టిక్కెట్ కొనాలని అనుకున్నాను. 3 అనే అంకె ఎక్కువసార్లు వచ్చే లాటరీ నంబర్‌ను ఎంచుకున్నాను. దాంతో 3337ను సెలక్ట్‌ చేసుకున్నాను. ఈ లాటరీ పొందడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ వార్తను నాభర్తతో ఫోన్‌లో చెప్పినపుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు. ఇంకా వారికి వార్త తెలియదు. ఇంటికి వెళ్లాక చెప్తాను. నా పిల్లల భవిష్యత్తు నాకుముఖ్యం. ఈ డబ్బుతో వారికి మంది విద్యను అందిస్తాను’ అని ఓ మీడియా సంస్థతో చెప్పారు.

గత పన్నెండేళ్లుగా పాయల్‌ డీడీఎఫ్‌ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారని మీడియా సంస్థ తెలిపింది. ప్రతిసారి ప్రయాణాల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌ వెళ్తున్నపుడు డీడీఎఫ్‌ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటని పాయల్‌ చెప్పారు. కానీ ఈసారి మొదటగా ఆన్‌లైన్‌లో ఖరీదు చేశానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement