Bank Holidays in 2021: List Holidays For Banks, Hyderabad, Telangana, AP, in Telugu - Sakshi
Sakshi News home page

2021లో బ్యాంక్‌ సెలవులు.. 40

Published Mon, Dec 28 2020 3:16 PM | Last Updated on Mon, Dec 28 2020 4:32 PM

40 days Bank holidays in 2021 - Sakshi

ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో బ్యాంకులకు సుమారు 40 రోజులకుపైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి. జనవరిలో 26న(మంగళవారం) రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవుకాగా.. ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో ఆదివారాలకుతోడు ప్రతీ 2,4వ శని వారాలు మాత్రమే బంద్‌కానున్నాయి. దేశీయంగా బ్యాంకులకు ఆదివారాలకుతోడు.. ప్రతీ నెలా 2, 4వ శనివారాలు సెలవులన్న సంగతి తెలిసిందే. ఇక మార్చిలో 11న(గురువారం) మహాశివరాత్రి, 29న(సోమవారం) హోలీ పండుగ సందర్భంగా సెలవులు అమలుకానున్నాయి. ఏప్రిల్‌ నెలలో 1న(గురువారం) ఖాతాల ముగింపు రోజుకాగా..  2న గుడ్‌ ఫ్రైడే, 14న(బుధవారం) అంబేడ్కర్‌ జయంతి, మే 13న(గురువారం) రంజాన్‌ పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవు. జులై 20న(మంగళవారం) బక్రీద్‌, ఆగస్ట్‌ 19న(గురువారం) మొహర్రం, 30న(సోమవారం) జన్మాష్టమి, సెప్టెంబర్‌ 10న(శుక్రవారం) గణేశ్‌ చతుర్థి నేపథ్యంలో బ్యాంకులకు సెలవు.  చదవండి: (రతన్‌ టాటా@ 83- నవ్యతకు వేదిక యువత)

వచ్చే ఏడాదిలో అక్టోబర్‌ 2న(శనివారం) గాంధీ జయంతి, 15న(శుక్రవారం) విజయ దశమి, నవంబర్‌ 4న(గురువారం) దీపావళి, 19న(శుక్రవారం) గురునానక్‌ జయంతి, డిసెంబర్‌ 25న(శనివారం) క్రిస్మస్‌ నేపథ్యంలో బ్యాంకులు పనిచేయవు. మకర సంక్రాంతి(జనవరి 14న), జన్మాష్టమి సందర్భంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే బ్యాంకులకు సెలవు అమలుకావచ్చని ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఏప్రిల్‌ 25న(ఆదివారం) మహావీర్‌ జయంతి, ఆగస్ట్‌ 15న(ఆదివారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. వీటికితోడు శని, ఆదివారాలు కలుపుకుని దేశంలోని పలు ప్రాంతాలలో బ్యాంకులకు సమారు 40 రోజులకుపైగా సెలవులు అమలుకానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement