ముంబై: ముంబై మార్కెట్లో అతిపెద్ద భూ విక్రయ లావాదేవీ నమోదైంది. బాంబే డైయింగ్ వర్లి ప్రాంతంలో తనకున్న 22 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సుమిటోమోకు రూ.5,200 కోట్లకు విక్రయించనుంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన వాడియా గ్రూప్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.
ఇదొక పెద్ద లావాదేవీ అని, దీంతో తమకున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని బాంబే రియల్టీ సీఈవో రాహుల్ ఆనంద్ ప్రకటించారు. లిస్టెడ్ కంపెనీ బోంబే డైయింగ్‌కు సబ్సిడరీయే బాంబే రియల్టీ. రుణ భారం నుంచి బయటపడి, బ్యాలన్స్ షీట్‌ను బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 2022–23 సంవత్సరానికి గాను బాంబే రియల్టీ రూ.517 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం.
తాజా లావాదేవీకి సంబంధించిన చెల్లింపులు తమకు రెండు విడతల్లో లభిస్తాయని.. మొదటి దశలో రూ.4,675 కోట్లు అక్టోబర్ నాటికి, మిగిలిన రూ.525 కోట్లు 2024 మార్చి నాటికి అందుతాయని రాహుల్ ఆనంద్ వెల్లడించారు. జపాన్‌కు చెందిన సుమిటోమో రియల్టీ అండ్ డెవలపర్‌మెంట్ సబ్సిడరీ అయిన గోయిసు రియల్టీ ఈ భూమిని కొనుగోలు చేయనుంది. గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఈ లావాదేవీ కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment