
గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపీఎస్‌ఈజెడ్) సుమారు 750 మిలియన్ డాలర్లను సేకరించింది. 20 సంవత్సరాల ,10.5 సంవత్సరాల బాండ్ల వాటాల నుంచి అసురక్షిత యూఎస్‌డీ నోట్లను జారీ చేయడం ద్వారా ఈ నిధులను సేకరించింది. అదానీ పోర్ట్ సెజ్‌లు 2021 జూలై 26 నుంచి షేర్లు జారీచేయడం నిలిపివేశారు. ఈ షేర్లు మూడు సార్లకు పైగా సబ్‌స్రైబ్ చేయబడ్డాయి.
అదానీపోర్ట్ సెజ్‌లు అన్ని భౌగోళిక ప్రాంతాలలో ఉన్న అధిక-నాణ్యత గల నిజమైన పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యాన్ని అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 20 సంవత్సరాల డబ్బును విజయవంతంగా సేకరించిన ఏకైక మౌలిక సదుపాయాల సంస్థ అదానీపోర్ట్ కంపెనీ తెలిపింది. సంస్థ ప్రత్యేకమైన వ్యాపార నమూనా, బలమైన ఫండమెంటల్స్ కారణంగా ఈ ఫీట్‌ను సాధించింది.
విదేశీ పెట్టుబడిదారుల నుంచి అదానీ పోర్ట్ సెజ్‌ల రుణ నిష్పత్తి 69 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని కంపెనీ పేర్కొంది. తగ్గిన మూలధనం వ్యయంతో వాటాదారులకు అధిక మూలధన రాబడి ఉంటుందని కంపెనీ అదానీపోర్ట్ సెజ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. సేకరించిన నిధులు దీర్ఘకాలిక మూలధన నిర్వహణకు సహాయపడతాయని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment