గత వారం ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి ట్యాక్స్ ప్లానింగ్ అమలుపర్చే దారిలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ట్యాక్స్ ప్లానింగ్‌లో ముఖ్యమైన భాగం.. చట్టాన్ని తప్పనిసరిగా సకాలంలో పాటించడమే. నిబంధనలను గౌరవించి అమలుపర్చడమే. పన్ను చెల్లించడం కూడా ప్లానింగ్‌లో ఒక భాగమే! ప్రతి అస్సెస్సీ తన నికర ఆదాయాన్ని ముందుగానే ఊహించడం చేయాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని కనీసం జూన్ మొదటి వారంలోగా అంచనా వేయాలి. ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు కష్టమే. అందునా ఇప్పుడు మనల్ని పీడిస్తున్న అనిశ్చితిలో ఇది మరింత కష్టమే. అయినప్పటికీ ఇది తప్పదు.
- ఉద్యోగస్తులకు సంబంధించిన పన్ను భారం టీడీఎస్ రూపంలో యజమాని రికవర్ చేస్తారు. కానీ వీరికి జీతం కాకుండా ఇతర ఆదాయం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్లు, వడ్డీ.. ఇలా ఎన్నో ఉండవచ్చు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది బ్యాంకులో ఉన్న ఎఫ్‌డీలకు సంబంధించిన వడ్డీ మీద ఏర్పడ్డ పన్ను భారం .. టీడీఎస్‌తో సరిపోతుందనుకుంటారు. అలా సరిపోదు. ఎందుకంటే బ్యాంకు కేవలం 10 శాతం మాత్రమే రికవర్ చేస్తుంది. మీకు మీ శ్లాబుని బట్టి మరో 10 శాతం లేదా 20 శాతం పడుతుంది. ఈ అదనపు ఆదాయాన్ని మీరు.. అంచనాల్లోకి తీసుకోవాలి.
- ఇక వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ముందు ముందు వ్యాపారం ఎలా ఉంటుందని ఊహించటం తప్పనిసరి. కనీసం గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయం బేసిస్‌గా తీసుకోండి.
- ఇది రెసిడెంట్లకు వర్తిస్తుంది.
- మొత్తం నికర ఆదాయం లెక్కించి, పన్ను భారాన్ని లెక్కించిన తర్వాత నాలుగు వాయిదాల్లో కింద పేర్కొన్న పట్టిక ప్రకారం చెల్లించాలి.
- 15 జూన్‌లోగా 15 శాతం
- 15 సెప్టెంబర్‌లోగా 30 శాతం
- 15 డిసెంబర్‌లోగా 30 శాతం
- 15 మార్చిలోగా 25 శాతం
- మార్చి 15 లోగా మొత్తం పన్ను భారం చెల్లించాలి. మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు టీడీఎస్ తగ్గించాలి.
- ఏదేని కారణం వల్ల కట్టకపోతే, చెల్లించేందుకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. మార్చి 15లోగా చెల్లించాలి.
- అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే అలా చెల్లించనందుకు గాను నెలకు 1 శాతం లోపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది అనవసరపు ఖర్చు.
- అంతే కాదు. మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ భారంలో 90 శాతం భాగాన్ని మార్చి 15లోగా చెల్లించకపోతే అదనంగా చెల్లించాల్సిన పన్ను మీద నెలకు 1 శాతం వడ్డీ వడ్డిస్తారు.
- కాబట్టి వెనువెంటనే 31-3-22కి సంబంధించి నికర ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించండి.
- అడ్వాన్స్ ట్యాక్స్ భారం రూ.10,000 లోపు ఉన్న వారికి పైన చెప్పిన నిబంధనలు వర్తించవు.
(చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment