సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఇంటర్నల్ పరీక్షలో ఫెయిల్ అయ్యారంటూ దాదాపు 600మందిని ఇన్ఫోసిస్ తొలగించింది. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇటీవల టెక్ దిగ్గజం విప్రో వందలమంది ఫ్రెషర్ల తొలగింపు పతరువాత ఇన్ఫోసిస్‌లో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది.
(ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు)
కాగా క్యూ3 ఫలితాల్లో ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి 13.4శాతం పెరిగి రూ. 6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది లాభం రూ. 5,809 కోట్లుగా ఉంది. నికర ఉద్యోగుల చేరిక గత ఏడాది త్రైమాసికంలోని పదివేల నుంచి 1,627కి పడిపోయింది. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో స్వచ్ఛంద అట్రిషన్ 27.1 శాతం, డిసెంబర్ 2021తో ముగిసిన మూడు నెలల్లో 25.5 శాతంగా ఉంది. అంతకుముందు, విప్రో పేలవమైన పనితీరు కారణంగా ఇంటర్నల్ టెస్ట్‌లో విఫలమవడంతో ఫ్రెషర్లను తొలగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment