
స్ఫూర్తిదాయక కథనాలను అందివ్వడంలో ఎప్పుడూ ముందుటారు ఆనంద్ మహీంద్రా. ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప ఎత్తులకు ఎదిగిన వారు, ప్రతిభ ఉన్నా గుర్తింపు నోచుకోని వారి గురించి ప్రమోట్ చేయడానికి ఈ పారిశ్రామికవేత్త ఎప్పుడు వెనుకాడరు. ఈసారి మరో స్ఫూర్తి నింపే విషయాలను మన ముందుకు తెచ్చారు.
గీత... ముంబై మహానగరంలోని విలేపార్లే లోని ఓ సాధారణ గృహిణి. ఆమె భర్త గోవింద్ పాటిల్ ఓ డెంటల్ ల్యాబ్‌లో క్లర్క్‌గా పని చేసేవాడు. ఇద్దరు పిల్లలు వినీత్, దర్శన్‌లు స్కూలుకు వెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లల కారణంగా ప్రతీ రోజూ స్కూల్‌లో ఏదో ఒక గొడవ జరిగేది. పిల్లలకు రుచికరమైన వంటకాలు లంచ్‌బాక్స్‌లో సర్ధేది గీత. ఆ బాక్స్ షేర్ చేసుకుంటామంటూ వినీత్, దర్శన్ ఫ్రెండ్స్ ప్రతీ నిత్యం గొడవలు పడేవారు. ఒక్కోసారి వీళ్లకు మిగల్చకుండా తినే వాళ్లు కూడా.
చుట్టుముట్టిన కష్టాలు
గోవింద్ పాటిల్ ఉద్యోగం 2016లో ఉన్నట్టుండి పోయింది. అప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యారు వినీత్, దర్శన్‌లు. ఇంటికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోవడం ఒక సమస్య అయితే పిల్లల చదువు ఖర్చులు పెరగడం మరో సమస్యగా మారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో గీతాగోవింద్ దంపతులకు అదనపు ఆదాయ మార్గం చూసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది.
మా వంటగది
పిల్లల లంచ్ బాక్స్ కోసం వాళ్ల ఫ్రెండ్స్ చేసే గొడవ గుర్తొచ్చింది గీతకు. భర్త సైతం ఆమె ఆలోచనలకు మద్దతు పలికాడు. అంతే ఇంట్లో కిచెన్‌లోనే స్నాక్స్ తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అవి అమ్ముడుపోతాయా ? వాటి మీద పెట్టే ఖర్చులు కనీసం వెనక్కి తిరిగి వస్తాయా అనే సందేహం వాళ్లను వదల్లేదు. దీంతో ముందుగా బృహాన్ ముంబై స్థానిక కార్యాలయంలో ముందుగా టీ, స్నాక్స్ అందివ్వాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కూడా ఈ వంటలకు మంచి పేరు రావడంతో కిచెన్‌లోనే హోం ఫుడ్స్‌కు శ్రీకారం చుట్టింది గీతాగోవింద్ పాటిల్.
చదువులకు అండగా
మహారాష్ట్ర ప్రాంతపు పిండివంటలు, స్నాక్స్‌కు తనదైన రెసిపీనీ యాడ్ చేయడంతో గీత చేసే హోంఫుడ్స్‌కు ఆ ఏరియాలో ఫ్యాన్ బేస్ పెరిగింది. క్రమం తప్పకుండా ఆర్డర్లు రావడం మొదలైంది. దీంతో హోం డెలివరీ సర్వీసులు సైతం మొదలయ్యాయి. అలా రెండేళ్లు గడిచే సరికి గోవింద్ పాటిల్ మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయాయి.
కరోనాలో ఆసరాగా
కరోనా కాలం కమ్మేసిన సమయంలో ముంబైలో అనేక మంది ఉన్న ఉపాధి కోల్పోయారు. గీత నివసించే ప్రాంతంలోనే ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో పడ్డాయి. ఈ తరుణంలోనే వాళ్లందరికి అండగా నిలిచింది గీత. అయితే పడుతున్న కష్టానికి చేతిలో మిగులుతున్న సొమ్ముకు పొంతన కుదరడం లేదు. ఎంత కష్టపడ్డా ఏడాది పన్నెండు లక్షలు మించి ఆదాయం కనపడలేదు.
పాటిల్‌కాకి
తన తల్లి చేస్తున్న వంటల్లో కమ్మదనం ఉన్నా వాటికి బ్రాండ్ ఇమేజ్ లేకపోవడం గమనించాడు వినీత్. వెంటనే తమ హోం ఫుడ్స్‌కి పాటిల్ కాకి అనే బ్రాండ్‌ను ఇచ్చాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రచారం నిర్వహించాడు. తమ కస్టమర్ బేస్‌తో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అంతే ఏడాది తిరిగే సరికి పాటిల్ కాకి స్వరూపమే మారిపోయింది.
రూ. కోటి క్రాస్
విల్లేపార్లేలోని చిన్న ఇంటిలో ఇరుకైన కిచెన్ నుంచి శాంతక్రాజ్ ఏరియాకు షిప్ట్ అయ్యింది పాటిల్ కాకి. మూడు వేల మందికి పైగా రెగ్యులర్ కస్టమర్ బేస్ రెడీ అయ్యింది. ఒక్క రోజులోనే వందల కొద్దీ కేజీల స్నాక్స్ హోం డెలివరీ చేయాల్సి వస్తోంది. 25 మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ వచ్చి చేరారు. కేవలం ఏడాది వ్యవధిలోనే పాటిల్ కాకి రెవెన్యూ పన్నెండు లక్షల నుంచి కోటి నలభై లక్షలకు చేరుకుంది.
This is the kind of ‘food’ startup that truly deserves a soaring valuation. Because the ingredients are grit & determination…you can’t learn that in Business Schools https://t.co/6m0NZjwWPv
— anand mahindra (@anandmahindra) June 24, 2022
చదవండి: మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా..
Comments
Please login to add a commentAdd a comment