టాటాలకి ఆనంద్‌ మహీంద్రా చిరు విన్నపం | Anand Mahindra Urge TATA Group To Resurrect Old Lounge In Mumbai Airport | Sakshi
Sakshi News home page

టాటాలకి ఆనంద్‌ మహీంద్రా చిరు విన్నపం

Published Sat, Apr 16 2022 1:30 PM | Last Updated on Sat, Apr 16 2022 1:39 PM

Anand Mahindra Urge TATA Group To Resurrect Old Lounge In Mumbai Airport - Sakshi

సోషల్‌ మీడియా వేదికగా టాటా గ్రూపుకి ఆనంద్‌ మహీంద్రా చిన్న విన్నపం చేసుకున్నారు. ఎప్పుడు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా లేటెస్ట్‌గా 1949లో అప్పటి బాంబే ఎయిర్‌ పోర్టు (శాంతాక్లాజ్‌)కి సంబంధించి  ప్యాసింజర్‌ బయల్దేరే లాంజ్‌కి సంబంధించిన పాత ఫోటో షేర్‌ చేశారు. 
 
ఆ రోజుల్లో విమాన ప్రయాణంలో హడావుడి ఉండేది కాదంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతేకాదు ఆ పాతకాలానికి చెందిన ప్యాసింజర్‌ డిపార్చర్‌ లాంజ్‌ని ముంబై ఎయిర్‌పోర్టులో ఏదైనా స్థలంలో టాటాలు పునరుద్ధరి‍స్తారేమో అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు. ఇలా చేస్తే అదొక టూరిస్ట్‌ ఎట్రాక‌్షన్‌ సెంటర్‌గా కూడా మారుతుందనే ఆకాంక్షను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ టాటాల ఆధీనంలో ఉన్నందున ఆనంద్‌ మహీంద్రా ఈ విజ్ఞప్తి చేశారు.

చదవండి:రండి..రండి.. దయచేయండి! ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement