ముంబై: బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి వేగాన్ని అందుకుంది. సెప్టెంబర్ 23తో ముగిసిన రెండు వారాల్లో బ్యాంకుల రుణాల్లో వృద్ధి 16.28 శాతానికి చేరుకున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఆహారేతర రుణాలు రూ.130 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 24 నాటికి ఈ రుణాలు రూ.111.85 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్ 23 నాటికి రెండు వారాల్లో డిపాజిట్ల పరంగా 9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం డిపాజిట్లు రూ.174.54లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి రూ.160 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆర్థిక కార్యకలాపాల్లో వృద్ధి, ఇతర మార్గాల నుంచి రుణ గ్రహీతలు బ్యాంకులవైపు మళ్లడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల స్థిరమైన వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయి. 2021–22 మొత్తం ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణాలు 8.59 శాతం పెరగ్గా, డిపాజిట్లలో 8.94 శాతం వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment