Bombay High Court dismisses Chanda Kochhar's plea against ICICI Bank
Sakshi News home page

ఐసీఐసీఐ స్కాం : చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ

Nov 12 2022 10:40 AM | Updated on Nov 12 2022 11:33 AM

Bombay High Court Dismisses Chanda Kochhar Plea - Sakshi

బాంబే హైకోర్టులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పదవీ విరమణ తర్వాత కొచ్చర్‌ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిరాకరించింది. 

అంతేకాదు 2018లో ఆమె సంపాదించిన 6.90 లక్షల షేర్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ ఆర్‌ఐ గహ్లా సింగిల్ బెంచ్ కొచ్చర్‌ను కోరినట్లు పీటీఐ నివేదించింది.దీంతో పాటు గతంలో ఆమె ఏదైనా షేర్లకు సంబంధించి ట్రాన్సాక్షన్‌, ఇతర వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఉంటే, ఆరు వారాల్లోగా అఫిడవిట్‌ సమర్పించాలని గహ్లా అన్నారు. 

ఈ సందర్భంగా  జస్టిస్ చాగ్లా మాట్లాడుతూ కొచ్చర్‌ రాజీనామా సమయంలో వెల్లడించని వాస్తవాలు ఇతర అంశాలపై పూర్తి అవగాహన బ్యాంకుకు లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు విచారణ నివేదిక అందిన తర్వాత మాత్రమే వెల్లడయ్యాయని అన్నారు. 

కాగా, ఐసీఐసీఐ స్కాంలో ‍ చందా కొచర్‌  వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో  క్విడ్‌ప్రోకో  ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్‌ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది.  ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్‌ దంపతులను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement