గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. యలహంక - పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్.. సోలాపూర్ హసన్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే మరో ఆరు ట్రైన్‌లను పాక్షికంగా రద్దు అవగా.. 12 రైళ్లను దారి మళ్లించింది. కాగా, ముందస్తు సమాచారం లేకపోవడంతో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
- సికింద్రాబాదు - యశ్వంత్ పూర్ మధ్య నడిచే 12735 నెంబర్ గల రైలును డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
- యశ్వంత్ పూర్ - సికింద్రాబాదు మధ్య నడిచే 12736 నెంబర్ గల రైలును డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
- సోలాపూర్ - హసన్ మధ్య నడిచే 11311 నెంబర్ గల రైలును డిసెంబర్ 12, 13, 14న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
- హసన్ - సోలాపూర్ మధ్య నడిచే 11312 నెంబర్ గల రైలును డిసెంబర్ 12, 13, 14న దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
Cancellation / Partial Cancellation / Diversion of Trains due to Non-Interlocking Works on South Western Railway @drmsecunderabad @drmgtl @drmgtl @VijayawadaSCR pic.twitter.com/EWRctFm5FX
— South Central Railway (@SCRailwayIndia) December 8, 2021
Comments
Please login to add a commentAdd a comment