న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ సంస్థలు అసమంజసమైన వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య (ఏఐసీపీడీఎఫ్) ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) పంపించినట్లు సమాచారం. సీసీఐ ఇప్పటికే ఈ–కామర్స్ సంస్థల మీద వచి్చన ఫిర్యాదులపై విచారణ చేస్తోంది.
క్విక్ కామర్స్ కంపెనీలు (క్యూసీసీ) పోటీవ్యాపారాలను దెబ్బతీసే విధానాలు పాటిస్తున్నాయంటూ తాము సీసీఐకి అధికారికంగా కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ దర్శిల్ పాటిల్ తెలిపారు. 10 నుంచి 30 నిమిషాల్లో సరుకులను డెలివర్ చేసే క్యూసీసీ విభాగంలో బ్లింకిట్, జెప్టో తదితర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీనితో తమ వ్యాపారాలపై ప్రభావం పడుతోందంటూ చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా క్యూసీసీ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment