
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ తయారుచేసిన కార్బెవ్యాక్స్ కోవిడ్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు ఆ సంస్థకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) తాజాగా అనుమతులిచ్చింది. దేశంలోనే హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందిన తొలి సంస్థ తమదే అని బయోలాజికల్ ఈ శనివారం ప్రకటించింది.
ముందుగా తీసుకున్న రెండు టీకాల తర్వాత వేరే తయారీ సంస్థకు చెందిన కోవిడ్ టీకా మూడోదిగా తీసుకుంటే దానిని హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా వ్యవహరిస్తారు. దేశంలో 18 ఏళ్లు, ఆపైబడిన వయసు వారు కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోస్‌లు తీసుకున్న 6 నెలల వ్యవధి తర్వాత బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment