న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ డైకిన్ ఇండియా రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో ఈ సెంటర్ కోసం కంపెనీ రూ.500 కోట్లు వెచ్చించనుంది. 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. 22 టెస్టింగ్ ఫెసిలిటీలు, ల్యాబ్స్ అందుబాటులోకి తెస్తారు. వచ్చే ఏడాది ఈ ఆర్‌అండ్‌డీ సెంటర్ కార్యరూపంలోకి రానుంది.
ఇప్పటికే సంస్థకు హైదరాబాద్, రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద ఇటువంటి ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీస్ ఉన్నాయి. భారతీయ వినియోగదారులకు సరిపోయే ఉత్పత్తులతోపాటు విదేశీ కస్టమర్ల కోసం స్థిర, పర్యావరణ అనుకూల సాంకేతికతలను రూపొందించడంపై నూతన కేంద్రం దృష్టి పెడుతుందని డైకిన్ ఇండియా సీఎండీ కె.జె.జావా తెలిపారు. భారతీయ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా తగిన సాంకేతికతలలో ఉత్పత్తులను నిర్మించడానికే కొత్త ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌డీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment