
ముంబై: చుట్టుముట్టిన ఆందోళనల నడుమ అంతర్జాతీయ సూచీలు పాజిటివ్‌గా కదలాడుతుండటంతో దేశీ స్టాక్‌మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వరుసగా నష్టపోతూ వస్తున్న బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ఈరోజు కొంత కుదురుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తుండటంతో ఈ తరహా పరిస్థితి కనిపిస్తోంది.
ఉదయం 10:15 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 57,614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 17,216 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మారుతి సుజూకి, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉండగా ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment