ముంబై : దేశీ స్టాక్ మార్కెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. బుల్‌జోరు కంటిన్యూ అవుతుండటంతో దేశీ సూచీలు రయ్ రయ్‌మంటూ పైపైకి దూసుకుపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
నిన్న సాయంత్రం బీఎస్‌సీ సెన్సెక్స్ 60,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కానీ ఈ రోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్‌సీ సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 61,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 18,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment