
ముంబై: స్టాక్ మార్కెట్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని అస్థిర వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు పీడకలగా వెంటాడిన నష్టాలు ఈ రోజు ఉదయం మటుమాయం అయ్యాయి. నిపుణుల అంచనాలున తలకిందులు చూస్తూ మార్కెట్ మంచి లాభాలతో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఆకాశమే హద్దుగా బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు చెలరేగాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ముఖ్యంగా బ్యాకింక్, ఆటోమొబైల్ సెక్టార్‌కి చెందిన షేర్లు కుదుపులకు లోనయ్యాయి. దీంతో క్రమంగా ఆరంభ లాభాలు ఆవిరికి కావడం మొదలైంది. చివరి గంటలో అమ్మకాలు మరింత ఉదృతంగా సాగడంతో దేశీ సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 500లకు పైగా పాయింట్ల లాభంతో 57,795 పాయింట్లతో మొదలైంది. ఒక దశలో 58,084 పాయింట్ల గరిష్టాన్ని టచ్ చేసింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో క్రమంగా పాయింట్లు కోల్పోతూ మార్కెట్ ముగిసే సమయానికి 77 పాయింట్ల నష్టంతో 57,200 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 17,101 పాయింట్ల దగ్గర ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీ నష్టాలకు లోనవకపోవడం ఈ రోజు ఇన్వెస్టర్లకు ఊరట కలిగించే అంశం. మారుతి, పవర్‌గ్రిడ్, టెక్‌మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు నష్టాలు చవి చూశాయి. సగటున ఈ కంపెనీల షేర్లు 2.99 శాతం క్షీణించాయి. ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment