ముంబై: కేంద్ర బడ్జెట్‌కి ముందు స్టాక్ మార్కెట్‌లు బుల్ రంకెలు వేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, ఏషియన్ మార్కెట్లతో సంబంధం లేకుండా దేశీ సూచీలు జూమ్.. జూమ్.. అంటూ పైకి ఎగబాకుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 722 పాయింట్లు లాభపడి 57,92 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 201 పాయింట్లు లాభపడి 17,303 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. రెండు దేశీ సూచీలు రమారమీ 1.40 శాతం వంతున వృద్ధి కనబరిచాయి.
ఈ స్టాక్ మార్కెట్ మార్నింగ్ సెషన్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 3.67 శాతం వృద్ధిని కనబరచగా ఆ తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి,. ఇక నష్టపోయిన షేర్లలో ఇండస్ ఇండ్, లార్సన్ అండ్ ట్రుబో కంపెనీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment