ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ ఫ్రైడేని నేడు చవిచూశాయి. బ్యాంక్, స్మాల్, మిడ్ క్యాప్ ఇలా అన్ని రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో దేశీయ సూచీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 1,939.32 పాయింట్ల లేదా 3.80 శాతం నష్టంతో సెన్సెక్స్ 49,099.99 వద్ద, నిఫ్టీ -568.20 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టంతో 14,529.15 వద్ద ట్రేడ్ ముగిసింది. ఇంట్రాడేలో 50,400 వద్ద గరిష్ఠాన్ని తాకిన బీఎస్‌ఈ ఇండెక్స్ 48,890 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ సూచీ 14,919 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేస్తే 14,467 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.14 వద్ద నిలిచింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment