భారత్ ఎకానమీ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని డెలాయిట్ ఇండియా పేర్కొంది. వినియోగ వ్యయం, ఎగుమతులు తిరిగి పుంజుకోవడం, పెట్టుబడుల పునరుత్తేజం వృద్ధికి దోహదపడే అంశాలుగా తాజా ఎకనమిక్ అవుట్‌లుక్‌లో వివరించింది. మధ్య–ఆదాయ తరగతి వేగవంతమైన వృద్ధి కొనుగోలు శక్తి పెరుగుదలకు దారితీస్తోందని తెలిపింది.
నితో ప్రీమియం లగ్జరీ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ కూడా మెరుగుపడుతున్నట్లు తెలిపింది. 2030–31 నాటికి మధ్యస్థ–అధిక–ఆదాయ విభాగాల సంఖ్య రెండు కుటుంబాలలో ఒకటిగా ఉంటుందని అంచనావేసింది. ఈ ధోరణి ప్రైవేట్ వినియోగదారుల వ్యయ వృద్ధికి దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు విశ్లేíÙంచింది. ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగు కుటుంబాల్లో ఒకటిగా ఉందని తెలిపింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మెరుగుపరుస్తూ ఇది 7.6 శాతం నుంచి 7.8% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. జనవరిలో వేసిన 6.9%–7.2% రేటు అంచనాలను గణనీయ స్థాయిలో పెంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment