Delloit
-
ఔషధ పరిశోధన రంగం వృద్ధికి సూచనలు
దేశీయంగా ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెలాయిట్, అసోచామ్ సంయుక్త నివేదిక తెలిపింది. ఈ దిశగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, మేధో సంపత్తి (ఐపీ) హక్కులను కాపాడడం, ఆవిష్కరణలను ప్రోత్సాహించడం కీలకమని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి ఇప్పటికీ విధానపరమైన సవాళ్లు నెలకొంటున్నట్లు తెలిపింది. నియంత్రణ కార్యాచరణను ఆధునికీకరించడం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో భారత ఫార్మా రంగం సమన్వయం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. అయితే ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఔషధ నియంత్రణల పరంగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల కొరత ఉంది. తయారీ యూనిట్లలో క్వాలిటీ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బలమైన కార్యాచరణ లేదు. దాంతో ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వెనకబడుతోంది. ఏకరూప నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న వివిధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయలోపం ఉంది. పాలనా పరమైన సమస్యల వల్ల ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్ అనుమతులకు అదనపు సమయం అవసరమవుతుంది. ఫలితంగా అత్యున్నత నాణ్యతతో కూడిన క్లినికల్ పరిశోధనలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా నిలవలేకపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే నిబంధనల అమలుకు భారత్‌లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సూక్ష్మ, చిన్న ఫార్మాస్యూటికల్ సంస్థలకు భారంగా మారుతుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?అంతర్జాతీయంగా ఫార్మాస్యూటికల్ ఆర్అండ్డీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలిపేందుకు స్పష్టమైన నియంత్రణలు, సరళీకృత ప్రక్రియలు అవసరమని ఈ నివేదిక సూచించింది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది. అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని తెలిపింది. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలసి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ప్రత్యేక కోర్సులు రూపొందించాలని సూచించింది. -
భారత్ వృద్ధి 6.6 శాతం: డెలాయిట్ ఇండియా
భారత్ ఎకానమీ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని డెలాయిట్ ఇండియా పేర్కొంది. వినియోగ వ్యయం, ఎగుమతులు తిరిగి పుంజుకోవడం, పెట్టుబడుల పునరుత్తేజం వృద్ధికి దోహదపడే అంశాలుగా తాజా ఎకనమిక్ అవుట్‌లుక్‌లో వివరించింది. మధ్య–ఆదాయ తరగతి వేగవంతమైన వృద్ధి కొనుగోలు శక్తి పెరుగుదలకు దారితీస్తోందని తెలిపింది. నితో ప్రీమియం లగ్జరీ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ కూడా మెరుగుపడుతున్నట్లు తెలిపింది. 2030–31 నాటికి మధ్యస్థ–అధిక–ఆదాయ విభాగాల సంఖ్య రెండు కుటుంబాలలో ఒకటిగా ఉంటుందని అంచనావేసింది. ఈ ధోరణి ప్రైవేట్ వినియోగదారుల వ్యయ వృద్ధికి దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు విశ్లేíÙంచింది. ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగు కుటుంబాల్లో ఒకటిగా ఉందని తెలిపింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మెరుగుపరుస్తూ ఇది 7.6 శాతం నుంచి 7.8% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. జనవరిలో వేసిన 6.9%–7.2% రేటు అంచనాలను గణనీయ స్థాయిలో పెంచడం గమనార్హం. -
అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వరుసగా ఈ ఏడాది కూడా భారతదేశంలో అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌గా నిలిచింది. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన భారతదేశంలోని మొత్తం టాప్ 25 వర్క్‌ప్లేస్‌ల జాబితాలో టీసీఎస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీసీఎస్. ఈ లిస్ట్‌లో అమెజాన్ , మోర్గాన్ స్టాన్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని లింక్డ్ఇన్ నివేదించింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) ముఖ్యంగా నైపుణ్యాల అభివృద్ధి; సంస్థ స్థిరత్వం; బాహ్య అవకాశాలు; కంపెనీ అనుబంధం; లింగ వైవిధ్యం; దేశంలో విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి లాంటి ఎ నిమిది పారామీటర్లు ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలోని 25 కంపెనీల్లోకొత్తగా 17 చేరాయి. తొలిసారిగా ఇ-స్పోర్ట్స్ అండ్ గేమింగ్ డ్రీమ్11, Games24x7 కంపెనీలు జాబితాలోకి వచ్చాయి. లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్‌లోగా ఉన్న జెప్టో ఈ జాబితాలో 16వ స్థానం గెల్చుకోవడం విశేషం. ఇంకా ఈ జాబితాలో రిలయన్స్, డెలాయిట్ లాంటి కంపెనీలు టాప్ 10లో ఉన్నాయి. ఇక లొకేషన్ విషయానికొస్తే, టాప్ లొకేషన్‌గా బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పూణే వంటి నగరాలు ఉన్నాయి. (Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ , కంప్యూటర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలను టెక్నాలజీ రంగంలోని కంపెనీలు అభ్యర్థులలో వెతుకుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో, కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. అలాగేఈ టాప్ 25 కంపెనీలు ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, కస్టమర్ సక్సెస్, డిజైన్, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ వంటి జాబ్ ఫంక్షన్లలో ప్రధానంగా పెట్టుబడులుపెడుతున్నాయని లింక్డ్ఇన్ వెల్లడించింది. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు) చిట్కాలు అలాగే ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులు కంపెనీపై రీసెర్చ్ చేయడం, సమగ్రతను చూపడం, ప్రామాణికంగా ఉండటం, ఉద్దేశాన్ని ప్రదర్శించడం, ఆసక్తిగా ఉండటం, డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడం, నిరాశ చెందకపోవడం లాంటి కొన్ని చిట్కాలను పాటించాలని లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పీర్, ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ తెలిపారు. అత్యుత్తమ కెరీర్‌కు ఇండియాలో టాప్ కంపెనీల లిస్ట్ 2023: టీసీఎస్, అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ, రిలయన్స్, మాక్వారీ గ్రూప్, డెలాయిట్,NAV ఫండ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, ష్నైడర్ ఎలక్ట్రిక్, వయాట్రిస్, రాయల్ కరేబియన్ గ్రూప్, విటెస్కో టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డ్, యుబి, ICICI బ్యాంక్, జెప్టో, ఎక్స్పీడియా గ్రూప్, ఈవై, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో., డ్రీమ్11 (డ్రీమ్ స్పోర్ట్స్) , సింక్రోనీ, గోల్డ్‌మన్ సాక్స్ , వెరింట్, గేమ్స్ 24x7, టీచ్‌మింట్ -
వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశీ కంపెనీలు అధునాతన వైర్లెస్ టెక్నాలజీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ఈ తరహా పెట్టుబడుల ప్రణాళికలకు సంబంధించి జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 71 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు.. మహమ్మారి కారణంగా వైర్లెస్ నెట్‌వర్కింగ్‌పై తమ తమ కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేస్తాయని విశ్వసిస్తున్నారు. 5జీ టెక్నాలజీ గానీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆఫీసుల్లో కమ్యూనికేషన్, మెషీన్లను రిమోట్‌గా పర్యవేక్షించడం, కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడం మొదలైనవి మరింత సులభతరం కాగలవని ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. 5జీ,వైఫై-6 వంటి కొత్త తరం వైర్లెస్ టెక్నాలజీలతో భద్రత, విశ్వసనీయత మొదలైన అంశాలకు సంబంధించి సర్వీసుల ప్రమాణాలు మెరుగుపడగలవని, వ్యాపార సంస్థలను విజయపథంలో నడపగలవని సర్వే తెలిపింది. -
బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే
సాక్షి,ముంబై: ఆర్థికాభివృద్ధికి గాను కేంద్రం ఇకపై తన దృష్టిని సరఫరాల పరమైన సమస్యల నుంచి నుంచి డిమాండ్ వైపు ఇబ్బందులపైకి మరల్చాలని రేటింగ్స్ సూచించింది. 2021-22 బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని సూచించింది. ముఖ్యాంశాలు చూస్తే... మహమ్మారి కరోనా దేశంలో సమస్యలు సృష్టించడం ప్రారంభించినప్పటి నుంచీ కేంద్రం తన దృష్టిని దాదాపు సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికే కేటాయించింది. డిమాండ్ వైపు సవాళ్లను తొలగించడానికి అంతగా ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఈ విధానం మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికి ప్రయతి్నంచడం మంచిదే. ఇందులో తప్పేమీ లేదు. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ఆర్థిక వ్యవస్థ క్షీణిత, రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి కట్టడి జరగడం హర్షణీయం. అయితే ఇక్కడ వ్యవస్థలో తగిన డిమాండ్ లేకపోతే సరఫరాల వ్యవస్థ పునరుద్ధరణ జరిగినా ఆర్థిక రికవరీలో మున్ముందు తగిన ఫలితాలు కనిపించవు. పైగా ఆర్థిక వ్యవస్థలో మరోదఫా మందగమన సమస్యలు తలెత్తుతాయి. 2012లో తలెత్తిన ఇదే తరహా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా సరఫరాల సమస్యలు రాకుండా భారీ ఉద్దీపనల ప్రకటనలు జరిగాయి. అయినా కంపెనీలు పెట్టుబడులకు పెద్దగా ముందుకురాలేదు. ఫలితంగా తక్కువ వేతనాలు, ఉపాధి కల్పన తగ్గడం తద్వారా డిమాండ్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లనుంచి ఉద్దీపన ప్రకటనలు, సరళతర ద్రవ్య విధానాలు వస్తున్నాయ్. సరఫరాల పరమైన ఇబ్బందులు తొలగుతున్నాయ్. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం ఇంకా మెరుగుపడ్డంలేదు. వేతనాలూ భారీగా పెరగని పరిస్థితి ఉంది. దీనితో వస్తు, సేవలకు తగిన డిమాండ్ నెలకొనడం లేదు. రానున్నది వ్యాపార పునరుద్ధరణ ‘బడ్జెట్’ పారిశ్రామిక రంగంలో 50 శాతం భరోసా ∙డెలాయిట్ సర్వే వెల్లడి కొత్త బడ్జెట్ (2021–22 ఆర్థిక సంవత్సరం) తమ వ్యాపారాల పునరుద్ధరణకు దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన 50 శాతం మంది ప్రతినిధులు భరోసాతో ఉన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న బడ్జెట్ అంశాలు, ప్రతిపాదనలపై ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ తాజాగా నిర్వహించిన సర్వేకు సంబంధించి శుక్రవారం వెల్లడైన కొన్ని అంశాలను పరిశీలిస్తే... కొత్త బడ్జెట్‌తో ఆర్థిక రికవరీ, డిమాండ్ వృద్ధి నెలకొంటాయని 70 శాతం పారిశ్రామిక వర్గం భావిస్తోంది. వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచడం వల్ల ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగతాయని సర్వేలో పాల్గొన్న కొందరు పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్లో చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. డిమాండ్ పెరుగుదలకు బడ్జెట్లో ప్రధానంగా చర్యలు ఉంటాయని 50 శాతం భావిస్తున్నారు. వస్తు, సేవల సరఫరాల్లో ఇంకా నెలకొన్న ఆంక్షలు, వినియోగదారులో నెలకొన్న ఆర్థిక, ఆరోగ్య సంబంధిత ఆందోళనల ప్రభావం వినియోగంపై ప్రభావం చోపుతోంది. వినియోగంపై కాకుండా పొదుపులవైపే వారి అధిక దృష్టి ఉంది. ఇది డిమాండ్‌ను కోవిడ్-19 ముందస్తు స్థాయిల్లోనే నిలబెడుతోంది. పన్ను మినహాయింపులు పెంచడం వల్ల వ్యక్తిగత ప్రైవేటు వినియోగం పెరుగుతుంది. ఇది మరిన్ని పెట్టుబడులకూ దారితీస్తుంది. ఆదాయం, డిమాండ్ వృద్ధి లక్ష్యాలుగా ఉపాధి కల్పన ప్రత్యేకించి నైపుణ్యం తక్కువగా ఉన్నవారికి ఉద్యోగ కల్పనపై బడ్జెట్ దృష్టి పెట్టే వీలుంది. భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు, విధానాలు, మౌలిక రంగం పురోగతికి తీసుకునే చర్యలు తయారీ రంగానికి కేంద్రంగా భారత్ ఆవిర్భవించడానికి చొరవలు, డిజిటలైజేషన్ ప్రోత్సాహకాలు దేశాభివృద్ధికి దోహదపడతాయి. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, మౌలిక, విద్యుత్, టెలికమ్యూనికేషన్ పరిశ్రమలు ప్రధానంగా తమ పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది. లఘు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత రుణ పరమైన లభ్యత లభిస్తుందని, ఇది వారి వ్యాపారాలు త్వరిత గతిన గాడిన పడ్డానికి దోహదపడతాయని సర్వేలో పాల్గొన్న ఆయా రంగాల 50 శాతం మంది ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 180 మంది నుంచి అభిప్రాయ సేకరణ : ‘‘పారిశ్రామిక రికవరీ వేగానికి 2021 కేంద్ర బడ్జెట్ చర్యలు ఉంటాయా’’ అన్న శీర్షికన ఆన్లైన్లో డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితుల కల్పన వంటి అంశాలతో కూడిన 12 ప్రశ్నలను సర్వేలో సంధించారు. తొమ్మిది పరిశ్రమల నుంచి 180 మంది ప్రతినిధులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలు ఇవీ... మౌలిక రంగంలో వ్యయాలు పెరగాలి. ప్రత్యేకించి ఉపాధి కల్పన విషయంలో ప్రోత్సాహకాలు కల్పించాలి. మధ్య పేద తరగతి ప్రజలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఆదాయ, ఆర్థిక సహాయాలను కొనసాగించడమే కాకుండా, ఈ దిశలో మరిన్ని చర్యలు ఉండాలి. ఎంజీఎన్ఆర్ఈజీఏ మరిన్ని నిధులు కేటాయించాలి. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడమేకాకుండా, కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన గ్రామీణ కారి్మకులకు సైతం ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. చౌక గృహ నిర్మాణ రంగానికి మద్దతు నివ్వాలి. ఇప్పటికీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్న, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం తన మద్దతు కొనసాగించాలి. ప్రజారోగ్య వ్యయాలను పెంచాలి. ఆయా చర్యల ద్వారా పన్ను యేతర ఆదాయాలు మరింత పెరగడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులను సమకూర్చాలి. రాష్ట్రాల హేతుబద్ధమైన వ్యయ ప్రణాళిలకు కేంద్రం మద్దతు ఉండాలి. తద్వారా 2021-22లో ఎకానమీ వృద్ధి రేటును 10 శాతంపైగా సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును జీడీపీలో 6.2 శాతానికి కట్టడి చేయగలుగుతాం. డిమాండ్ - సరఫరా విధానాలపై వ్యత్యాసం! సరఫరాల వైపు విధానాల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, వస్తు సేవలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాదారులే లక్ష్యంగా పన్ను కోతల వంటి ఉద్దీపన చర్యలు ప్రకటించడం. తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించడం. ఇక వినియోగదారుల అవసరాలు, వారి డిమాండ్లకు అనుగుణంగా పన్ను కోతలు తదితర చర్యలు తీసుకోవడం ఆయా డిమాండ్ చర్యలను తీసుకోవడడం ద్వారా ఆర్థిక పురోగతికి బాటలు వేయడం. రికవరీ బాగుంది : ఆర్థిక రికవరీ తగిన సంతృప్తికరమైన బాటలో నడుస్తోందని ఇటీవలి గణాంకాలు, వ్యాపార సంకేతాలు తెలియజేస్తున్నాయి. స్వావలంభన భారత్, ఉత్పాదన అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి పథకాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి దోహదపడుతున్నాయి. మౌలిక రంగంలో వ్యయాల వల్ల తమ వ్యాపారాలకు గట్టి మద్దతు లభిస్తుందని సంబంధిత పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. - సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
డెల్లాయిట్ కంపెనీకి కోర్టు ఆదేశాలు
- అగ్రిగోల్డ్ కేసులో డెల్లాయిట్కు ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీల టేకోవర్‌కు సంబంధించి న్యాయస్థానం వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సుభాశ్చంద్ర ఫౌండేషన్ తరఫున ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న డెల్లాయిట్ కంపెనీని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని వారంలోగా డిపాజిట్ చేయాలని తేల్చిచెప్పింది. షరతులు, విధి విధానాలు తదితర వివరాల గురించి తదుపరి విచారణప్పుడు మాట్లాడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీల ఆస్తులు, డిపాజిట్ల డాక్యుమెంట్లను పరిశీలించేందుకు డెల్లాయిట్ను అనుమతించాలని.. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో పాటు ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులను ఆదేశించింది. అలాగే ఆయా ఆస్తుల సేల్డీడ్లు, ఇతర పత్రాలను పరిశీలించేందుకు డెల్లాయిట్ ప్రతినిధులను అనుమతించాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల వద్ద తనఖా ఉన్న ఆస్తుల వివరాల పరిశీలనకు కూడా అనుమతిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, ధర్మాసనం ఆదేశాల మేరకు డిపాజిట్‌దారుల వివరాలను అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్‌తో పాటు ఏపీ సీఐడీ న్యాయవాది కృష్ణప్రకాశ్ అందించారు. 32 లక్షల మంది డిపాజిటర్లకు రూ.6,880.52 కోట్లు చెల్లించాల్సి ఉందని వారు కోర్టుకు తెలిపారు.