న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) అటు కార్పొరేట్, ఇటు బిజినెస్‌ల విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు డిష్ టీవీ గ్రూప్ సీఈవో అనిల్ కుమార్ దువా కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే సమస్యలు ఎదురైనప్పటికీ సామర్థ్యాలపై నమ్మకంతో ఆశావహంగా ముందుకు సాగినట్లు తెలియజేశారు. వెరసి దేశీయంగా కంటెంట్ డెలివరీ విభాగంలోని ప్రధాన సంస్థలలో ఒకటిగా నిలిచినట్లు వివరించారు.
అతిపెద్ద వాటాదారు సంస్థ యస్ బ్యాంక్, కంపెనీ చైర్మన్ జవహర్ లాల్ గోయెల్ మధ్య న్యాయపరమైన వివాదం తలెత్తిన విషయం విదితమే. డిష్ టీవీ బోర్డులో ప్రతినిధుల అంశంపై వివాదం ఏర్పడింది. కంపెనీలో యస్ బ్యాంకుకు 24 శాతం వాటా ఉంది. గోయెల్‌తోపాటు కొంతమంది ఇతర సభ్యులను తప్పించడం ద్వారా బోర్డును పునర్వ్యవస్థీకరించమంటూ యస్ బ్యాంక్ డిమాండ్ చేస్తోంది.
చదవండి: Cyrus Mistry: మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్..‘నా కళ్లెదురుగా ప్రమాదం ఎలా జరిగిందంటే!..’
Comments
Please login to add a commentAdd a comment