న్యూఢిల్లీ: కరోనావైరస్ కొత్త వేరియంట్లు, మరిన్ని వేవ్‌లు రావడంపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు వేగంగా కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుతున్నాయని పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహమ్మారిపరమైన ఆర్థిక సమస్యలను అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు తోడ్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇక టీకాల ప్రక్రియ పుంజుకుంటోండటంతో థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనే సామర్థ్యాలను భారత్ మెరుగుపర్చుకోగలదని ఆయన పేర్కొన్నారు.
గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా బిర్లా ఈ విషయాలు తెలిపారు. నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్ ప్రాజెక్టులకు సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెట్టుబడులు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడా మహమ్మారిని ఎదుర్కొనడంలో చెప్పుకోతగ్గ స్థాయిలో సామర్థ్యాలు కనబర్చాయని బిర్లా వివరించారు. ఉత్పాదకత, డిజిటైజేషన్ చర్యలు వేగవంతంగా అమలు చేశాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment