ప్రస్తుతం ప్రపంచం అంతట ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది. ట్రెండ్‌కి తగ్గట్టు మన దేశంలో కూడా చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే, బ్రిటిన్‌కు చెందిన ఒక కంపెనీ మాత్రం అన్నీ కంపెనీలు ఒక లెక్క.. నేను ఒక లెక్క అంటుంది. అన్నీ కంపెనీల వాహనాల పోలిస్తే ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ చాలా భిన్నంగా ఉంది. బ్రిటిన్‌కు చెందిన ఆర్క్ అనే కంపెనీ మిగతా కంపెనీలు లాగా కాకుండా కొత్త తరహాలో ఆర్క్ వెక్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ని 2021లో లాంచ్ చేసింది.
దీని ధర మన భారతీయ కరెన్సీలో రూ.91 లక్షలుగా ఉంది. ఈ హైపర్ లగ్జరీ ఆర్క్ వెక్టర్ బైక్ అత్యాధునిక టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. ఈ బైక్‌లో పేటెంట్ పొందిన ఫ్రంట్ ఎండ్ కార్బన్ ఫైబర్ స్వింగ్ ఆర్మ్స్, కస్టమ్ డాంపర్లు, బ్రెంబో స్టైల్మా బ్రేక్ సిస్టమ్ ఉన్నాయి. ఇందులో 95 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది.ఇది కేవలం 3.2 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని రేంజ్ వచ్చేసి 436 కి.మిగా కంపెనీ పేర్కొంది. ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 200 కి.మీ. ఈ బైక్‌ని డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో 45 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఇది ప్రస్తుతం డెలివరీ కోసం కూడా అందుబాటులో ఉంది. కానీ, మన దేశంలో కాదు. దీనిని తీసుకొస్తారా? లేదా అనే విషయంపై అస్పష్టత ఉంది.
(చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా)
Comments
Please login to add a commentAdd a comment