ఎలాన్ మస్క్ గత కొంత కాలం నుంచి 'టెస్లా సైబర్‌ట్రక్' (Tesla Cybertruck) గురించి చెబుతూనే ఉన్నాడు. 2019లో ఈ కారుని ఆవిష్కరించినప్పటికీ.. ఇప్పటి వరకు లాంచ్ గురించి అధికారిక వివరాలు పంచుకోలేదు. అయితే గతంలో చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాగా ఇప్పుడు టెక్సాస్‌లోని గిగా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్-స్పెక్ సైబర్‌ట్రక్ డ్రైవ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోను మస్క్ షేర్ చేశారు.
ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిక్ టెస్లా సైబర్‌ట్రక్ ప్రొడక్షన్-స్పెక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇది చూడటానికి డెల్టా ఆకారంలో ఉండే మిర్రర్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.
ఇప్పటికి మస్క్ ఈ సైబర్ ట్రక్ ఫోటోలను షేర్ చేయడం రెండవ సారి. అంటే ఇది త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సైబర్‌ట్రక్ కేవలం నేల మీద మాత్రమే కాకుండా నీటిలో కూడా బోట్ మాదిరిగా ప్రయాణిస్తుంది గతంలో మస్క్ వెల్లడించాడు.
ఇదీ చదవండి: లాక్మే కంపెనీకి లక్ష్మీదేవికి సంబంధమేంటి? స్వాతంత్య్రం వచ్చిన తరువాత..
ఇది వాటర్ ప్రూఫ్ కారు. కావున నీటిలో ప్రయాణించేటప్పుడు కూడా ఎలాంటి అవరోధాలు గురి కాకుండా ఉంటుంది. అంతే కాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ కారుకంటే కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఇండియాకు వస్తుందా? రాదా? అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Just drove the production candidate Cybertruck at Tesla Giga Texas! pic.twitter.com/S0kCyGUBFD
— Elon Musk (@elonmusk) August 23, 2023
Comments
Please login to add a commentAdd a comment