ఎలన్ మస్క్..! అంతు చిక్కని వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఎవరూ ఊహించని విధంగా షాకులిస్తున్నారు. గ్యాప్ ఇచ్చి వరుసగా టెస్లా షేర్లను అమ్మేస్తున్నారు. తాజాగా టెస్లాలోని తన షేర్లను అమ్మకానికి పెట్టగా.. ఇప్పటి వరకు ఎలన్ 9.2 శాతం అమ్మినట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా ఎన్ని అమ్మాడు
ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా $1.05 బిలియన్ల విలువైన 934,091 షేర్లను అమ్మేశారు. షేర్ల అమ్మకంపై యూఎస్ సెక్యూరిటీ అధికారికంగా ప్రకటించాయి.
ట్వీట్లాట
నవంబర్ 6న టెస్లాకు చెందిన 10శాతం షేర్లను అమ్మేయాలని అనుకుంటున్నాను. అందుకు మీరేమంటారు' అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు ఎలన్‌కు మద్దతు పలికారు. దీంతో ఎలన్ మస్క్ షేర్ల అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పటికే 1.05 బిలియన్ షేర్లను అమ్మిన ఎలన్ మరో 2.15 షేర్లును అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించారు.
షేర్లు అమ్మకానికి కారణం
ఇటీవల వాషింగ్టన్‌లో డెమోక్రాట్లు బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తుండగా.. 10 శాతం టెస్లా షేర్లను అమ్మి..అంతరిక్షంలో మానవుని మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎలన్ స్పేస్‌ఎక్స్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment