అణ్వాయుధాల ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే కొన్ని అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రకటిస్తూనే ఇరాన్ తాజాగా ఒకేసారి మూడు ఉపగ్రహాలను స్పేస్‌లోకి ప్రవేశపెట్టింది.
ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమాన్ ఖమేని స్పేస్ పోర్ట్ నుంచి మహ్దా(పరిశోధనా ఉపగ్రహం), కెహాన్-2(గ్లోబల్ పొజిషనింగ్), హతేఫ్-1(కమ్యూనికేషన్) నానో ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది. ఇలాంటి ప్రయోగం చేయడం ఇరాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కొన్ని మీడియా కథనాల ప్రకారం..
- ‘మహ్దా’ ఉపగ్రహాన్ని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది.
- ఈ ఉపగ్రహాలను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహననౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
- ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిసింది.
- స్పేస్ ఆధారిత పొజిషనింగ్ టెక్నాలజీ, న్యారో బ్యాండ్ కమ్యునికేషన్ పరీక్షించే లక్ష్యంతో ఇరాన్ ఈ ప్రయోగాలను చేపట్టింది.
- బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి.
- ఇలాంటి ప్రయోగాలకు దిగొద్దని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినా తన బాలిస్టిక్ క్షిపణుల కోసం ఇరాన్ ఈ టెక్నాలజీను వాడుకోబోతున్నట్లు ప్రకటించింది.
- దేశ పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులను వాడేందుకే ఈ ప్రయోగం జరిగినట్లు పశ్చిమదేశాలు అభిప్రాయపడుతున్నాయి.
- ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
యునైటెడ్ స్టేట్స్ గతంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తున్నాయని గతంలో తెలిపింది. అణ్వాయుధాలను పంపిణీ చేయగల బాలిస్టిక్ క్షిపణులతో కూడిన ఎలాంటి కార్యకలాపాలను చేపట్టవద్దని గతంలోనే తీర్మానించాయి. తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment