Satellite carrier
-
అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..!
అణ్వాయుధాల ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే కొన్ని అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రకటిస్తూనే ఇరాన్ తాజాగా ఒకేసారి మూడు ఉపగ్రహాలను స్పేస్‌లోకి ప్రవేశపెట్టింది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమాన్ ఖమేని స్పేస్ పోర్ట్ నుంచి మహ్దా(పరిశోధనా ఉపగ్రహం), కెహాన్-2(గ్లోబల్ పొజిషనింగ్), హతేఫ్-1(కమ్యూనికేషన్) నానో ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది. ఇలాంటి ప్రయోగం చేయడం ఇరాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ‘మహ్దా’ ఉపగ్రహాన్ని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహాలను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహననౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిసింది. స్పేస్ ఆధారిత పొజిషనింగ్ టెక్నాలజీ, న్యారో బ్యాండ్ కమ్యునికేషన్ పరీక్షించే లక్ష్యంతో ఇరాన్ ఈ ప్రయోగాలను చేపట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ప్రయోగాలకు దిగొద్దని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినా తన బాలిస్టిక్ క్షిపణుల కోసం ఇరాన్ ఈ టెక్నాలజీను వాడుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశ పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులను వాడేందుకే ఈ ప్రయోగం జరిగినట్లు పశ్చిమదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. యునైటెడ్ స్టేట్స్ గతంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తున్నాయని గతంలో తెలిపింది. అణ్వాయుధాలను పంపిణీ చేయగల బాలిస్టిక్ క్షిపణులతో కూడిన ఎలాంటి కార్యకలాపాలను చేపట్టవద్దని గతంలోనే తీర్మానించాయి. తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
12న జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం: ఇస్రో
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు. 2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్టమొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం. 2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. -
నేడు ‘మార్స్ మిషన్’ రిహార్సల్
శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఉపగ్రహాన్ని అంగారక గ్రహానికి మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ-సీ 25 రెడీ అయ్యింది. ఉపగ్రహ వాహక నౌకను మొదటి లాంచింగ్ ప్యాడ్‌లో సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ -సీ25 ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 6.08 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. యాభై ఆరున్నర గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ25 నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా సేకరించింది. గురువారం లాంచ్ రిహార్సల్ జరగనుండగా.. 2వ తేదీన కౌంట్‌డౌన్‌కు ముందు వ్యవహారాలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తారు. మొత్తం ఐదు దశల్లో భూమి చుట్టూ తిప్పిన తర్వాత ఉపగ్రహాన్ని అంగారకుని వైపు పంపుతారు. డిసెంబర్ 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది అంగారకుని కక్ష్యలోకి చేరుకోవడానికి 300 రోజుల సమయం పడుతుందని అంచనా. 2014 సెప్టెంబర్ నాటికి ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అంగారక వాతావరణంలో మిథేన్ వాయువు ఉనికిని గుర్తించడం, క్యుటీరియం.. హెచ్3వో నిష్పత్తిని అంచనా వేయడం, మార్స్ ఫొటోలు తీయడం రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఇందుకోసం ఉపగ్రహంలో ఐదు శాస్త్రీయ పరికరాలను ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. మనకున్న పరిమితుల్లో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ‘షార్’లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపగ్రహం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరు రౌండ్ స్టేషన్లను వినియోగిస్తున్నామని, వీటిలో రెండు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని రెండు నౌకల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్సీఐ నలంద, ఎస్సీఐ యమునా నౌకలు దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉపగ్రహాన్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. చంద్రయాన్ 2 గురించి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో ఉపయోగించే ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం అదనపు నిధులు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘షార్’లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, అసోసియేట్ డెరైక్టర్ వి.శేషగిరిరావు, డెరైక్టర్ కున్ని కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. పది నిమిషాలు గాయబ్ పీఎస్ఎల్వీ-సీ25 శ్రీహరికోట నుంచి ప్రయోగించిన అనంతరం మూడో దశ ముగిసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉండదు. ఉపగ్రహం కదలికలను పర్యవేక్షించే గ్రౌం డ్ నెట్‌వర్క్‌ల మధ్య ఇది కదులుతుండటమే దీనికి కారణం. నాలుగో దశ ప్రయోగం మొదలయ్యే కొద్ది సెకన్ల ముందు దక్షిణ పసిఫిక్‌లోని మొదటి కేంద్రం ఉపగ్రహం సంకేతాలను అందుకుంటుంది.