కరోనా మహమ్మారి వంటి క్లిష్ట కాలంలో కూడా భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరు పెరిగింది. 2020-21 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) 40 శాతం పెరిగి 51.47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నేడు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.
"2020-21 మొదటి తొమ్మిది నెలల్లో (51.47 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహం 40 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే(36.77 బిలియన్ డాలర్లు) ఇది అధికం" అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2020) ఈ ప్రవాహం 37 శాతం పెరిగి 26.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డిసెంబరులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 24 శాతం పెరిగి 9.22 బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో దేశంలోకి వచ్చాయి. గత ఆరున్నర సంవత్సరాలలో తీసుకున్న ఎఫ్‌డిఐ విధాన సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్య విధానాలతో దేశంలోకి ఎఫ్‌డిఐల ప్రవాహం పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment