లేడీస్‌ స్పెషల్‌... ఇండస్ట్రియల్‌ పార్క్‌ | FICCI Ladies Organisation: Ladies Special 50 acre industrial park ready to Open in Hyderabad | Sakshi
Sakshi News home page

మహిళల కోసం ప్రత్యేకం.. 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌

Published Mon, Mar 7 2022 4:13 PM | Last Updated on Mon, Mar 7 2022 4:18 PM

FICCI Ladies Organisation: Ladies Special 50 acre industrial park ready to Open in Hyderabad - Sakshi

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ - ఎఫ్‌ఎల్‌వో( లేడీస్‌ ఆర్గనైజేషన్‌) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్‌ పార్క్‌ రూపుదిద్దుకుంది. నగర శివార్లలో ఉన్న సూల్తాన్‌పూర్‌ ఏరియాలో 50 ఎకరాల్లో సిద్దమైన ఈ పార్కుని ప్రారంభించనున్నారు. 

మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న ఈ పార్కుని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇరవై ఏళ్ల కిందట యాభై మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో ప్రారంభం అయ్యింది. తాజాగా ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో 800ల మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement