ముంబై: అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నిలువరించడానికి ఫైనాన్షియల్ రంగం, దానికి ఎదురయ్యే ఇబ్బందులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అత్యున్నత స్థాయి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం ఉద్ఘాటించింది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఈ సమావేశం, ఎకానమీపై కీలక సమీక్ష జరిపింది. సకాలంలో తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థల సంసిద్ధత అవసరాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, రెగ్యులేటర్ల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment