SBI : పల్స్‌ కార్డ్‌.. మీ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా | Full Details About SBI PULSE CARD | Sakshi
Sakshi News home page

SBI CARDS: ఫిట్‌నెస్‌ ప్రయోజనాలు అందించే మొట్టమొదటి క్రెడిట్‌ కార్డ్‌

Published Tue, Dec 14 2021 7:59 PM | Last Updated on Tue, Dec 14 2021 8:00 PM

Full Details About SBI PULSE CARD - Sakshi

హైదరాబాద్‌: ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల ఆరోగ్యం, క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ఫీచర్లతో ఈ కార్డ్  డిజైన్‌ చేశారు. ఈ కార్డు ఆవిష్కరణ సంధర్భంగా ఎస్‌బీఐ కార్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రామ్మోహన్‌ రావు అమర మాట్లాడుతూ, “కొవిడ్‌-19 తర్వాత హెల్త్‌ కాన్షియస్‌ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ను ప్రవేశపెడుతున్నాం. ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ విషయంలో పెరుగుతున్న మా కస్టమర్ల అవసరాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సహకరించే విధంగా ఈ కార్డ్ ఉంటుంది” అన్నారు.  

ప్రయోజనాలు
ఈ కార్డుతో వెల్‌కమ్‌ గిఫ్టుగా కస్టమర్లకు నాయిస్‌ కలర్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ అందుతుంది. 1.4 ఇంచుల ఫుల్‌ కలర్‌ డిస్‌ప్లే, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్ (SPO2), స్లీప్‌ మానిటరింగ్‌ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఉన్నాయి. 
- ఏడాదిపాటు ఫిట్‌పాస్‌ ప్రో సభ్యత్వాన్ని ఈ కార్డు ద్వారా లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 4000 ప్లస్‌ జిమ్స్, ఫిట్‌నెస్‌ స్టూడియోలకు ఈ ద్వారా యాక్సెస్‌ లభిస్తుంది. అక్కడ యోగా, డ్యాన్స్, కార్డియో, పిలేట్ ఇంకా అనేక ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ సెషన్లను దీని ద్వారా పొందవచ్చు. 
- ఈ కార్డు ద్వారా కస్టమర్లు ఒక సంవత్సరం నెట్‌మెడ్స్‌ ఫస్ట్ మెంబర్‌షిప్‌ దక్కుతుంది. ఏడాది పాటు ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టెషన్లతో పాటు ప్రాథమిక హెల్త్ చెకప్‌, పాథాలజీ ల్యాబ్‌ టెస్టులపై  5 శాతం తగ్గింపు వర్తిస్తుంది. 
- వార్షిక ఫీజు చెల్లించి కార్డుపై మొదటి రిటెయిల్‌ లావాదేవీ జరిపిన వెంటనే ఫిట్‌పాస్‌, నెట్‌మెడ్స్‌ సభ్యత్వం యాక్టివేట్‌ అవుతాయి. 
- సంపన్న శ్రేణిని లక్ష్యంగా చేసుకుని అందిస్తున్న ఈ కాంటాక్ట్‌ లెస్‌ కార్డు వార్షిక మెంబర్‌షిప్‌ ఫీజు రూ.1499 మాత్రమే. దీన్ని వీసా సిగ్నేచర్‌ ఫ్లాట్‌పామ్‌పై విడుదల  చేస్తున్నారు. కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.2 లక్షల కొనుగోళ్లు జరిపినట్టయితే రెన్యూవల్‌ ఫీజు మినహాయింపు చేస్తారు. 
- ఫార్మసీలు, ఔషధ దుకాణాలు, డైనింగ్‌, సినిమాలపై జరిపే కొనుగోళ్లకు 5X రివార్డు పాయింట్లను కొనుగోలుదారులు పొందుతారు. అంతే కాదు కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు అయితే రూ.1500 విలువైన నెట్‌మెడ్‌ ఈ-వోచర్‌ లభిస్తుంది. 
- ఏడాది కాలంలో 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ లాంజ్‌ విజిట్స్, 99 డాలర్ల విలువైన కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌, కాంప్లిమెంటరీ గ్రూప్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్, కాంప్లిమెంటరీ ఫ్రాడ్‌ లయబిలిటి కవర్‌, కాంప్లిమెంటరీ ఎయిర్‌ యాక్సిడెంట్‌ కవర్ కూడా ఉన్నాయి.

వెల్‌కమ్‌ ఆఫర్‌
కస్టమర్లు జాయినింగ్‌ ఫీజు చెల్లించిన తర్వాత స్వాగత కానుకగా రూ.4,999 విలువ చేసే నాయిస్‌  కలర్‌ఫిట్‌ పల్స్ స్మార్ట్‌ వాచ్‌ను అందిస్తున్న మొట్టమొదటి కార్డ్‌ ఎస్‌బీఐ పల్స్‌. 

చదవండి:SBI: మహిళల కోసం ప్రత్యేక హెల్త్‌ ప్లాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement